చందాపూర్‌లో వడగళ్లతో కూడిన వర్షం

చందాపూర్‌లో వడగళ్లతో కూడిన వర్షం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.  ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం చల్లదనాన్ని ఇచ్చినప్పటికీ, ఉరుములు, ఈదురు గాలుల బీభత్సం భయాందోళనకు గురిచేసింది. అకాల వర్షంతో చేతికి వచ్చే పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.