సమ్మె.. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలు
MDCL: RTC సమ్మె కారణంగా కూకట్ పల్లి డిపోకు చెందిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలంటూ నేటి నుంచి సమ్మెకు దిగిన నేపథ్యంలో బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు ఇతర కార్యకలాపాలకు వెళ్లేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఎక్కడ కూడా RTC బస్సు తిరగకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.