శామీర్‌పేట వైపు పెరుగుతున్న రిసార్ట్ కల్చర్!
HYD: ORR రోడ్డుకు సమీపంగా ఉన్న శామీర్‌పేట వైపు రిసార్ట్ కల్చర్ పెరుగుతుంది. చుట్టూర విశాలవంతమైన వాతావరణం, పట్టణ ప్రాంతానికి అతి సమీపంలో ఉండటంతో ఒక్కో రిసార్ట్ నాలుగైదు ఎకరాల్లో నిర్మించి, నిర్వహిస్తున్నారు. వీకెండ్ సమయాల్లో హైటెక్ సిటీ, KPHB, సికింద్రాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి టెక్ నిపుణులు, యువత భారీ సంఖ్యలో శామీర్‌పేట రిసార్ట్‌లకు మొగ్గుచూపుతున్నారు.