ఉధృతంగా ప్రవహిస్తున్న మత్తడివాగు

ఉధృతంగా ప్రవహిస్తున్న మత్తడివాగు

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామ శివారులో ఉన్న మత్తడి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా జన్నారం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి కవ్వాల్ మత్తడి వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వాగు, మహమ్మదాబాద్, మొర్రిగూడ వాగులలో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.