'ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం'
VKB: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధమని SP స్నేహ మెహ్ర అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని చెప్పారు.