కొల్లాపురమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

కొల్లాపురమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: కంబదూరు మండలం గూళ్యం గ్రామంలో జరిగిన కొల్లాపురమ్మ జాతరలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర, ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. వారికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంబదూరు మండల పార్టీ అధ్యక్షుడు శివన్న, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.