పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న అరెస్ట్

GNTR: పాతగుంటూరులో తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, అతని మరణానికి కారణమైన అన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. DSP అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం రామిరెడ్డితోటకు చెందిన ఆటోడ్రైవర్ సురేశ్, అతని అన్న రమేశ్ మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈనెల 22న రమేశ్, సురేశ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శుక్రవారం మృతి చెందారు.