గ్యాస్ ఏజెన్సీల ముందు పడిగాపులు
GDWL: ఆలంపూర్ నియోజకవర్గంలో వంట గ్యాస్ అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉగాది, రంజాన్ పండుగల వేళ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కోసం బుక్ చేసుకున్న వారికి మొబైల్‌కు OTP రాకపోవడంతో టెక్నికల్ సమస్య తలెత్తి పంపిణీ నిలిచిపోయింది. OTP ఉన్నవారు సైతం క్యూలైన్లో నిలుచొని ఇబ్బందులకు గురవుతున్నారు.