సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన వరంగల్ వాసి
వరంగల్ జిల్లా శాయంపేట గ్రామానికి చెందిన గుండు అఖిలేష్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. 464వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికైన అఖిలేష్ సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కష్టపడి చదివి ఈ విజయం సాధించారని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, యువత ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు పొందాలని ఆకాంక్షించారు.