ఆదిలాబాద్‌ను మినీ కాశ్మీర్ చేస్తాం: జూపల్లి
TG: రానున్న రోజుల్లో టూరిజం హబ్‌గా ఆదిలాబాద్ మారబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రకృతి సౌందర్యంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం జిల్లాకు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆదిలాబాద్‌ను మినీ కాశ్మీర్ చేస్తామని ప్రకటన చేశారు. దీంతో ఆదిలాబాద్‌కు పెట్టుబడులు, యువకులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.