వైద్య విద్యార్థిని చదువుకు చేయూత
ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో నగరానికి చెందిన దొడ్డపనేని విజ్ఞత రెండవ సంవత్సరం చదువుతోంది. ఫీజు చెల్లించేందుకు స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి ఎన్‌ఆర్‌ఐ కొమ్మినేని శ్రీనివాస్ రూ. 9500 చేయూతనందించారు. ఈ సాయాన్ని బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా విద్యార్థినికి అందించారు. ఈ కార్యక్రమంలో NRI ఫౌండేషన్ బాధ్యులు, తదితరులు ఉన్నారు.