'సబ్సిడీలో యంత్ర పరికరాలు'
MDK: నిజాంపేట మండల రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. చిన్న సన్న కారు రైతులు ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరం అందించనున్నట్లు తెలిపారు. రైతులు దరఖాస్తు ఫారం, పట్టాపాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు ఫోటోలను అందజేయాలన్నారు.