బండ్ల గణేశికి భూపేశ్ రెడ్డి సంఘీభావం
KDP: షాద్ నగర్ నుంచి తిరుమలకి సంకల్ప యాత్ర చేస్తున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కి కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈరోజు ఖాజీపేట దగ్గర ఆయనను కలిశారు. సీఎం చంద్రబాబు కోసం పాదయాత్ర చేయటం చాలా సంతోషమని, ఆ వేంకటేశ్వర స్వామి ఆయనను దీవించాలని భూపేశ్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల పాల్గొన్నారు.