'హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ఉప్పలపాడులో శుక్రవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందిన విధానాన్ని ప్రజలకు తాము వివరిస్తున్నామని తెలిపారు.