అహోబిలం మఠం మేనేజర్‌కి సత్కారం
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో రోటరీ భవనం నందు ఆదివారం అహోబిలం మఠం మేనేజర్ బద్రి నారాయణకు సోషల్ సర్వీస్ లో 'డాక్టరేట్'వచ్చిన సందర్భంగా వారిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పోలేపల్లి సత్యనారాయణ మేనేజర్‌ని పూలమాల, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బైసాని రవి ప్రకాష్, శబరిస్, సత్యం శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.