ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే
NLR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిన్న లింగసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల అర్జీలను స్వీకరించి, సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలంటూ ఆయన సూచించారు.