ఇంటి దొంగను పట్టిన పోలీసులు
ప్రకాశం: ముండ్లమూరు(M) సుంకరవారి పాలెంలో సొంత బంధువు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఆరవీటి కోటేశ్వరరావును ముండ్లమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 10,000 విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.