రైతులకు కొత్తగూడ పోలీసుల హెచ్చరిక
MHBD: కొత్తగూడ మండలంలో మొక్కజొన్నను ప్రధాన రహదారి పై ఆరబోసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు బుధవారం హెచ్చరించారు. రైతులు వారి కల్లాల్లోనే ధాన్యం ఆరబెట్టు కోవాలని తెలిపారు. మొక్కజొన్న రోడ్డు పై పోయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్డు పై ప్రమాదం జరిగితే రైతులదే బాధ్యత అని హెచ్చరించారు.