చిరుత పులి కదలికపై నిరంతర నిఘా

చిరుత పులి కదలికపై నిరంతర నిఘా

NDL: శ్రీశైలం-దోర్నాల మార్గమధ్యంలో చిన్నారుట్లా గిరిజన గూడెంలో బాలికపై చిరుత పులి దాడి చేసిన ఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికల కోసం అన్ని ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే అవకాశం ఉన్నందున దాని కదలికలను పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకున్నట్లు దోర్నాల రేంజర్ హరి పేర్కొన్నారు.