ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :ఎస్సై

JGL: కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేడిపల్లి, భీమారం మండల ప్రజలు అత్యవసర సమయంలో తప్ప బయటకు రావొద్దని మేడిపల్లి ఎస్సై ఎం. శ్రీధర్ రెడ్డి తెలిపారు. రోడ్లపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ స్థంబాలు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువకులు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, చెరువులకు దూరంగా ఉండాలన్నారు.