బీసీ సెల్ అధ్యక్షులు మల్లయ్యకు మాతృవియోగం
KMM: కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బీసీ సెల్ అధ్యక్షులు చల్ల మల్లయ్య తల్లి అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి వారి స్వగ్రామానికి చేరుకుని మల్లయ్య తల్లి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తల్లి మరణాన్ని జీర్ణించుకోక బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు.