ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణ పనుల పరిశీలన

NRPT: మద్దూర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఆయన తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి, తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.