బీఆర్ఎస్ పాలకులు వేల కోట్లు దోచుకున్నారు: ఎమ్మెల్యే
BHNG: బీఆర్ఎస్ పాలకులు వేల కోట్లు దోచుకున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకులకే ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ మండలంలో మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు.