19న రాష్ట్రస్థాయి జట్ల ఎంపిక పోటీలు
CTR: ఖేలో ఇండియా బీచ్ గేమ్స్- 2025 ఓపెన్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడలోని కృష్ణా రివర్ బేసిన్ వద్ద జరగను న్నట్లు డీఎల్డీవో ఉదయభాస్కర్ తెలిపారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, బీచ్ సెపక్ టెక్రా క్రీడల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు చిత్తూరులోని డీఎసీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.