ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయ వేళలు మార్పు

TPT: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయ వేళలో మార్పు చేయడం జరిగిందని గూడూరు సబ్ కలెక్టర్ కే.రాఘవేంద్ర మీనా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని ఈ విషయాన్ని డివిజన్‌లోని అధికారులు పాటించాలన్నారు.