అన్న సమారాధనికి రూ. 1.50 లక్షలు విరాళం
E.G: కోరుకొండ సాయిబాబా ఆలయ వద్ద కార్తీక మాసం సందర్భంగా ఇవాళ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొని రూ. 1,50,000 అన్న సమారాధన కార్యక్రమానికి విరాళంగా కమిటీ సభ్యులకు అందజేశారు. దాతకు కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.