భారీ వర్షాలు.. కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్

భారీ వర్షాలు.. కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్

కృష్ణా: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం కారణంగా, రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.