డిజి పురంలో విద్యార్థుల సూర్య నమస్కారాలు

SKLM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్రపండుగగా ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులలో సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ ప్రతీ పాఠశాలలో సూర్యనమస్కారాలు అనే కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా సోమవారం దండుగోపాలపురం జెడ్పీహెచ్ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో 350 విద్యార్థులచే సూర్య నమస్కారాలు చేయించారు.