ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ప్రకాశం: మార్చి నెల పెన్షన్ను ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 28వ తేదిన పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజా బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,91,658 మంది పింఛన్ దారులకు 122.09 కోట్ల రూపాయలు పంచడం జరుగుతుందన్నారు. 28వ తేదీన తీసుకోని వారికి 2న పంపిణీ చేస్తారన్నారు. పెన్షన్ దారులు తమ ఇళ్ల దగ్గర అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.