లక్కరాజుగార్లపాడులో ఆలయాల శంకుస్థాపన
PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో శ్రీ పంచ పట్టాభి రామస్వామి, శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల శంకుస్థాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.