యూరియాపై రాజకీయం తగదు: మంత్రి పొన్నం

KNR: మాజీ ఎంపీ కవిత తమ కుటుంబంపై చేసిన విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే యూరియా బస్తాలపై బతుకమ్మ పేర్చి ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి వచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని యూరియా సరఫరా గురించి అడగాలని సూచించారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తగదని ఆయన అన్నారు.