VIDEO: పారిశుద్ధ్య నిర్వహణపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

E.G: రాజమండ్రిలోని 43, 44 డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగని వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.