ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
MHBD: జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్ హాజరై, ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశ సమైక్యత, 1971 యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.