బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు

MNCL: జిల్లా కేంద్రంలోని ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు స్వీకరిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంతరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్న 10-20 ఏళ్లలోపు బాల బాలికలు ప్రవేశాలకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు కోచ్ రాజేష్‌ను 99635 39234 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.