రైసు మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మార్వో

రైసు మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మార్వో

VZM: బొబ్బిలి మండలంలోని పిరిడి, కలవరాయి రైసు మిల్లులను ఎమ్మార్వో ఎం.శ్రీను శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలును పరిశీలించారు. ధాన్యం నిల్వలను, ట్రక్ షీట్స్ జారీపై ఆరా తీశారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేసి ట్రక్ షీట్స్ జారీ చేయాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.