గుర్తు తెలియని వ్యక్తి మృతి

NRML: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నిర్మల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు నిర్మల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి మృతి చెంది ఉండగా గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.