బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

JGL: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుని స్వాగతిస్తూ మెట్పల్లి పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు లాంటిదన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇది గుణపాఠం అని ఎద్దేవా చేశారు.