VIDEO: 'బ్రిడ్జి పనులు నాసిరకంగా చేపడుతున్నారు'
MLG: వెంకటాపురం మండలం రాచుపల్లి - మల్లాపురం మార్గంలోని కంకలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ బ్రిడ్జి పక్కన ఉన్న భూమి నుంచి మట్టి తొలగించడంతో భూమి కోతకు గురవుతోందని రైతు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు కొనసాగిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని రైతు హెచ్చరించారు.