సీఎం సహాయం నిధి ప్రజలకు గొప్ప వరం: MLA

సీఎం సహాయం నిధి ప్రజలకు గొప్ప వరం: MLA

GDWL: సీఎం సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం లాంటిదని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కేటీ దొడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ​మొత్తం రూ.2,75,500 విలువైన ఈ చెక్కులు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి.