ఈ నెల 12 న చిమట గంగమ్మ తల్లి తిరుణాళ్లు
ప్రకాశం: మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గంగమ్మ తల్లి జాతర తిరుణాళ్లు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు పొంగళ్ళు, మొక్కులు భక్తులు సమర్పించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం వేళల్లో ఆయా రాజకీయ పార్టీ వారి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు.