హిందూపురంలో ఈ నెల 14న పర్యటించనున్న బాలకృష్ణ

సత్యసాయి: హిందూపురంలో ఈ నెల 14న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంజేపీ గురుకుల పాఠశాలలో ల్యాబ్స్, వసతి గృహాలను పరిశీలించి, 11:15 గంటలకు పూలకుంటలో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించనున్నారు.