VIDEO: స్వామివారిని తాకిన సూర్యకిరణాలు..!
ADB: జైనథ్ మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడటం జరిగిందని ఆలయ అర్చకులు తెలియజేశారు. నేటినుంచి వారం రోజులపాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలపై పడటం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.