ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: సీపీ
NZB: ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. గురువారం నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.