VIDEO: '7వ మహాసభను జయప్రదం చేయాలి'
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని అంగడి సెంటర్‌లో న్యూడెమోక్రసీ అనుబంధ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 7వ జిల్లా మహాసభ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి కళారూపాలు, డప్పులతో, కానూరి రచించిన పాటలతో సభ ప్రారంభమవుతుంది. ప్రజలు, విద్యావంతులు, మేధావులు, కమ్యూనిస్టు భావాలు కలిగినవారు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు.