బాపట్లలో గంజాయి తరలిస్తూ.. అరెస్ట్
బాపట్ల జిల్లా పోలీసులు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. బిలస్పూర్ టూ తిరుపతి ట్రైన్‌లో తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు ఒడిశా యువకులు ట్రైన్ దిగి వేటపాలెం వైపు పరారయ్యే ప్రయత్నం చేయగా SI, ఈగల్ సెల్ బాపట్ల పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.