చిన్నారిని సురక్షితంగా చేరదీసినా ఎస్సై
MHBD: గూడూరు మండలం చింతలగట్టు వట్టివాగులో సమ్మక్క–సారలమ్మ జాతరలో నేడు తప్పిపోయిన ఓ చిన్నారిని ఎస్సై గిరిధర్ రెడ్డి సురక్షితంగా చేరదీశారు. జాతర స్థలంలో ఏర్పాటు చేసిన అనౌన్స్ మైక్ ద్వారా చిన్నారి తండ్రి పేరును పిలవడంతో కొద్దిసేపటిలో తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎస్సై గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.