నేడు ప్రజాదర్బార్‌లో పాల్గొనున్న ఎమ్మెల్యే
VZM: జామి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ తహసీల్దార్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అర్జీ రూపంలో సమర్పించాలని కోరారు.