మళ్లీ దాడి: గొర్రెల మందపై విరుచుకుపడ్డ పులి
GDWL: మల్దకల్ మండలం నేతువానిపల్లిలో చిరుతపులి సంచారం గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం ఒక లేగదూడను హతమార్చిన చిరుత, శనివారం తెల్లవారుజామున గొర్రెల మందపై దాడి చేసి భీభత్సం సృష్టించింది. వరుస దాడులతో గ్రామ శివారులో రక్తపు మరకలు ఆరకముందే మళ్లీ దాడి జరగడంతో రైతులు, పశుపోషకులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.