VIDEO: కృష్ణ మందిరంలో గీతా జయంతి వేడుకలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని పాత వీధిలోని శ్రీ కృష్ణ మందిరంలో గీతా జయంతి సందర్భంగా సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో భగవద్గీత పారాయణం చేశారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఆలయ కమీటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.