అందమైన కురుల కోసం ఇలా చేయండి!

మారుతున్న జీవనశైలి, స్టైలింగ్ కోసం వాడే ఉత్పత్తుల కారణంగా జుట్టు రాలటం, నిర్జీవంగా మారుతుంది. ఇంట్లో చేసుకునే హెయిర్ ప్యాక్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డు సొనలో కాస్త తేనె, ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె, ఏదైనా ఆర్గాన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.